సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టనున్న ప్రీతిజింతా

Posted February 10, 2017

preethi jintha started second inningsప్రేమంటే ఇదేరా సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించిన ప్రీతిజింతా గుర్తుంది కదూ. 2013లో ఇష్క్‌ ఇన్‌ ప్యారిస్‌  అనే సినిమాలో నటించిన ఆమె త్వరలోనే సెకెండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయనుంది. చిరాగ్‌ దారివాల్‌ నిర్మాణంలో నీరజ్‌ పాథక్‌ దర్శకత్వం వహించబోతున్న ‘భయ్యాజీ సూపర్‌ హిట్‌’ అనే సినిమాలో నటించనుందని  సమాచారం.

ఈ సినిమాలో  ప్రీతి.. సన్నీడియోల్‌ సరసన నటించబోతోందని తెలుస్తోంది. తన రోల్ కి ప్రాధాన్యత ఉండడంతోనే సినిమాల్లో నటించడానికి ప్రీతి ఒప్పుకుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా తన భర్త జీజిని గుడెనఫ్‌ సలహా మేరకు తిరిగి  సినిమాల్లో నటించనున్నానని, తన భర్త ప్రోత్సహించకుంటే నటనకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు ప్రీతి తెలిపింది. మరి భర్త సలహా మేరక నటను కంటిన్యూ చేస్తున్న ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ సెట్ అవుతాయో లేదో చూడాలి.