ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ టూర్..

Posted November 25, 2016

prime minister narendra modi hyderabad tourప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ హైద‌రాబాద్ కు రానున్నారు. శివ‌రాంప‌ల్లిలోని స‌ర్దార్ ప‌టేల్ అకాడ‌మీలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న డీజీపీల స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొన‌బోతున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు ప్ర‌త్యేక విమానంలో.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్ర‌ధాని చేరుకుంటారు. ఆయన వెంట పలువురు కేంద్రమంత్రులు, అధికారులు కూడా ఈ విమానంలో రాబోతున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం మధ్యాహ్నమే హైదరాబాద్ కు చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాన రోడ్డుమార్గంలో కిషన్‌ గూడ, కామంచెర్వు, మధురా నగర్‌, ఆర్బీనగర్‌, కొత్వాల్‌ గూడ చౌరస్తా, భారత చౌరస్తా, సాతం రాయి, గగన్‌ పహాడ్‌, ఓల్డ్‌ కర్నూల్‌ చౌరస్తా మీదుగా.. శివరాంపల్లిలోని సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీకి చేరుకోనున్నారు. ప్ర‌ధాని మోడీ రాక నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోడీ రాత్రి స‌ర్దార్ ప‌టేల్ అకాడ‌మీలోనే బ‌స చేస్తారు. అనంత‌రం రేపు ఉదయం జరగనున్న జాతీయ డీజీపీల సమావేశంలో పాల్గొంటారు.