వేశ్య పాత్ర‌లో ప్రియాంక‌!!

Posted February 5, 2017

priyanka chopra as prostitite
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా న‌ట‌న‌లో దూసుకుపోతోంది. ఆమె కెరీర్ లోనే ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. హాలీవుడ్ లో సైతం ఇప్పుడు ఈ అమ్మ‌డి హ‌వా నడుస్తోంది. అమెరికా టీవీ సిరీస్ క్యాంటికో, బేవాచ్ సినిమాల‌తో అక్క‌డ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. హాలీవుడ్ రేంజ్ కు ఎదిగినా.. బాలీవుడ్ ను మాత్రం విడిచిపెట్ట‌బోనంటోంది ప్రియాంక‌.

దాదాపు రెండేళ్ల త‌ర్వాత ప్రియాంక బాలీవుడ్ కు తిరిగొచ్చింది. ప్ర‌స్తుతం ముంబైలోనే మ‌కాం వేసింది. క‌థ‌లు వినే ప‌నిలో బిజీగా ఉంది. పాత్ర మంచిదైతే చాలు.. చిన్న క్యారెక్ట‌ర్ అయినా వేస్తానంటూ బాలీవుడ్ బ‌డా డైరెక్ట‌ర్ల‌తో చెప్పింద‌ట‌. ఈ మ‌ధ్యలోనే స్టార్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ మంచి క‌థ‌ను ప్రియాంక ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడ‌ట‌. ర‌చ‌యిత సాహిర్ లుథియాన్వి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఆ క‌థ రూపొందిందట‌. ఈ స్టోరీ ప్రియాంక‌కు తెగ న‌చ్చేసింద‌ట‌. అయితే ఈ ముద్దుగుమ్మ ఇందులో ఏ పాత్ర‌లో నటించ‌నుందో తెలిస్తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతారు. ఒక వేశ్య‌పాత్ర‌లో ఈ హీరోయిన్ న‌టించ‌నుంది. ఈమేర‌కు భ‌న్సాలీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌.

కెరీర్ లో ఉన్న‌త శిఖ‌రాల వైపు దూసుకెళ్తున్న ప్రియాంక‌.. ఈ టైమ్ లో వేశ్య పాత్ర చేయడం రిస్కేనంటున్నారు బాలీవుడ్ జ‌నం. అయితే ఈ అమ్మ‌డు మాత్రం డోంట్ కేర్ అంటోంది. న‌ట‌న‌ను అవ‌కాశ‌మున్న పాత్ర ఏదైనా తాను రెడీ అంటోంది. మ‌రి ఈ వేశ్య‌పాత్ర ప్రియాంక‌కు ఏ మాత్రం క‌లిసి వ‌స్తుందో చూడాలి. !!