తీపి గుర్తుల్లో ప్రియాంక…

priyanaka

ప్రియాంక చోప్రా.. భారత్ ప్రతినిధిగా హాలీవుడ్ లో గుర్తింపు సాధించింది. ఈ ఘనత సాధించేందుకు ఆమె చేసిన హార్డ్ వర్క్ తోటి నటీనటులకే కాక అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. యూత్ ఐకన్ గా ప్రశంసలు అందుకుంటున్న ప్రియాంక.. తన భవిత ఇలా ఉంటుందని 16ఏళ్ల క్రితం అస్సలు అనుకోలేదని చెప్తోంది. 16ఏళ్ల క్రితం ఏం జరిగిందని అనుకుంటున్నారా? 2000ల్లో ఆమె ప్రపంచసుందరి కిరీటం కైవసం చేసుకుంది. అప్పుడామెకు 18ఏళ్లు. తానీస్థాయిలో ఉంటానని ఎన్నడూ ఊహించలేదని చెప్తూ.. మిస్ వాల్డ్ పోటీల్లో కిరీట ధారణ అనంతరం దిగిన ఫొటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఈ అందమైన ఫొటో కింద.. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ మెసేజ్ సైతం రాసింది ప్రియాంక. అప్పుడు నాకు 18ఏళ్లు. ఇప్పటికీ భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తానన్న ఆలోచన నాకు అప్పుడు లేనేలేదు. అదృష్టవంతురాలిని అంటూ ఈ ‘క్వాంటికో’ సీరిస్ సుందరి పేర్కొంది.