ప్లీజ్‌.. పిల్లలతో నా సినిమా చూడొద్దు

0
115

Posted May 16, 2017 at 13:15

priyanka chopra said don't watch baywatch movie to childrens
బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు దాదాపు అంతా కూడా హాలీవుడ్‌ సినిమాల్లో నటించాలని కోరుకుంటూ ఉంటారు. కనీసం ఒక్కటి అంటే ఒక్కటైనా కూడా హాలీవుడ్‌లో చేయాలని, అక్కడ తమ సత్తా ప్రపంచానికి చాటాలని భావిస్తారు. బాలీవుడ్‌లో నటించేప్పుడు కాస్త హద్దుల్లో ఉండి, అందాల ప్రదర్శణ విషయంలో ఆచి తూచి వ్యవహరించే ముద్దుగుమ్మలు హాలీవుడ్‌ అనగానే అన్ని విప్పేసేందుకు సైతం సిద్దం అంటారు. అన్ని విప్పేయడం హాలీవుడ్‌లో చాలా కామన్‌. కనుక తాము విప్పేస్తే తప్పేంటి అని వారు ప్రశ్నిస్తూ ఉంటారు. తాజాగా రాధిక ఆప్టే ఒక హాలీవుడ్‌ సినిమా కోసం పూర్తి న్యూడ్‌గా నటించిన విషయం తెల్సిందే. ఇక తాజాగా మరో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ‘బేవాచ్‌’ అనే హాలీవుడ్‌ మూవీలో హద్దులు దాటి మరీ అందాల ఆరబోత చేసింది.

‘బేవాచ్‌’ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ తాజాగా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అందులో మహా దారుణంగా ప్రియాంక చోప్రా అందాల ఆరబోత చేసింది. సినిమాలో ఇంకా మరింత ఘాటుగా అందాల ప్రదర్శణ ఉంది కాబోలు అందుకే తన సినిమాను దయచేసి పిల్లలతో చూడవద్దని చెబుతుంది. తన సినిమా పూర్తిగా అడల్ట్‌ కంటెంట్‌ను కలిగి ఉందని, పిల్లలకు ఎంత మాత్రం చూపించకుండా ఉండటమే మంచిదని ఇండియన్‌ ప్రేక్షకులను సున్నితంగా హెచ్చరించింది. మరీ ఇంత దారుణంగా ఉంటే ఎందుకు నటించాలని కొందరు అంటున్నారు.