పూరి డైరక్షన్ లో మరోసారి..!

Posted November 15, 2016

Puri Directs Kangana Ranaut Once Againఇజం ఫ్లాప్ తర్వాత పూరి తీసే సినిమా ఏది.. కుర్ర హీరోలకు కథ ప్రిపేర్ చేస్తున్నట్టు టాక్ వచ్చినా అందులో వాస్తవం ఎంతో తెలియదు. అయితే పూరి గురించి మరో స్పెషల్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనాతో పూరి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడట. ఇప్పటికే ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాలో పూరి డైరక్షన్లో నటించిన కంగనా రనౌత్ మరోసారి పూరితో కలిసి పనిచేస్తుంది.

బాలీవుడ్ క్వీన్ గా నేషనల్ అవార్డ్ సైతం కైవసం చేసుకున్న కంగనా ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని చెక్ చేసుకోనుందట. అయితే ఈ న్యూస్ గురించి పూరి కాంపౌండ్ నుండి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేదాకా ఇది కచ్చితంగా రూమర్ అనాల్సిందే. అయితే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చార్మితో జ్యోతిలక్ష్మి చేసి చేతులు కాల్చుకున్న పూరి మళ్లీ అలాంటి తప్పు చేస్తాడా అని డౌట్ రేజ్ చేస్తున్నారు.

స్టార్ హీరోలెవరు ప్రస్తుతం పూరికి అవకాశం ఇవ్వకపోవడంతో కుర్ర హీరోలతో చేసేందుకు ఫిక్స్ అయినా మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు పూరి. మరి కంగనాతో ప్రాజెక్ట్ విషయంపై పూర్తి డీటేల్స్ త్వరలో వెళ్లడవుతాయి.