మూడు కోతులు.. ఒక మేకను తయారు చేస్తున్న పూరి..!

0
135

Posted December 6, 2016

Puri Next Movie Title As Mudu Kothulu Oka Mekaడేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఈమధ్య కాస్త రేసులో వెంకపడ్డట్టు కనిపించినా మళ్లీ తన సత్తా చాటేందుకు కొత్త సినిమాతో రాబోతున్నాడు. కళ్యాణ్ రాం ఇజం ఫ్లాప్ తో కాస్త ఢీలా పడ్డ పూరి బ్యాంకాక్ వెళ్లి కథ పూర్తి చేసుకుని వచ్చారు. ఇక సినిమా టైటిల్ గా మూడు కోతులు.. ఒక మేక అని పెట్టబోతున్నాడట. సాధారణంగా తన సినిమాల టైటిల్స్ తో ఎట్రాక్ట్ చేసే పూరి ఎప్పుడు సీరియస్ టైటిల్స్ లేదా ఇడియట్, లోఫర్, రోగ్ అంటూ కాస్త వెరైటీ టైటిల్స్ కూడా వాడేశాడు.

అయితే ప్రస్తుతం వినపడుతున్న మూడు కోతులు ఒక మేక మాత్రం కాస్త కొత్తగా ఉంది. ఇందులో ముగ్గుగు హీరోలుంటాయని చెప్పకనే చెప్పిన పూరి వారెవరై ఉంటారని కన్ ఫ్యూజ్ చేసేశాడు. స్టార్ హీరోలెవరు ఛాన్సులు ఇచ్చే అవకాశం లేదని తెలుసుకుని కుర్ర హీరోలతోనే సినిమా తీయలని ఫిక్స్ అయిన పూరి ఈ సినిమాతో రాబోతున్నాడు. మరి పూరి తయారు చేసే ఆ ముగ్గురు కోతులెవరో చూడాలి.

అసలైతే ఎనర్జిటిక్ స్టార్ రాం, యువ హీరో నాగ శౌర్యలతో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్న పూరి ఈ కథ వారి కోసమే రాసుకున్నాడా అని ఆరా తీస్తున్నారు. మరి ముగ్గురు యువ హీరోలున్నా పూరి మార్క్ మల్టీస్టారర్ సినిమా అయ్యే అవకాశాలున్నాయి. సో మొత్తానికి సరికొత్త టైటిల్ తో పూరి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాడు.