చిల్లర.. మార్చితే ‘వీరుడు’.. ఇస్తే ‘దేవుడు’

Posted November 14, 2016

pj1416ప్రధాని రద్దు చేసిన 500, 1000 నోట్లు మార్చుకునే ప్రయత్నంలో బ్యాంకుల దగ్గర క్యూలో నిలుచుని మరి తమ దగ్గర ఉన్న మొత్తాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. అయితే ఈ ప్రయత్నంలో తమ దగ్గరున్న నాలుగు పాత 500 రూపాయల నోట్లను తీసుకుని కొత్త 2000 నోటు చేతికిస్తున్నారు. 100 నోటు కంటికే కానరాకుండా పోయింది.. ఈ క్రమంలో కొత్త 2000 నోటు చేతికి వచ్చిన ఆనందంలో బయటకు వచ్చి దాన్ని మార్చే క్రమంలో మళ్లీ చుక్కలు చూస్తున్నారు ప్రజలు.

ఈ టైంలో పూరి తన మార్క్ పంచ్ డైలాగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. 2000 నోటు చిల్లర మార్చిన వాడు వీరుడు.. చిల్లర ఇచ్చిన వాడు దేవుడు అంటూ తన మార్క్ సెటైరికల్ పంచ్ వేశాడు పూరి జగన్నాథ్. నోట్ల రద్దు వల్ల నల్లధనం నిర్మాలన జరుగుతుందన్న కారణం చేత ప్రతి భారతీయ పౌరుడు తనకు కలుగుతున్న ఇబ్బందిని సైతం లెక్క చేయట్లేదు. దేశ భవిష్యత్తు బాగు పడాలంటే తాము కష్టపడక తప్పదని వారు నిర్ణయించుకున్నారు.