పుష్కర రైళ్లు…

  pushkara trains

కృష్ణా పుష్కరాలకు 626 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా అన్నారు. విజయవాడ చుట్టూ 4 శాటిలైట్‌ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా విశాఖ, విజయవాడ, తిరుపతి మధ్య డబుల్‌ డెక్కర్‌ రైళ్లు కేటాయించామన్నారు. 146 ప్రత్యేక రైళ్లలో మాత్రమే రిజర్వేషన్‌ సదుపాయం కల్పించి మిగతా 480 ప్రత్యేక రైళ్లలో నేరుగా టికెట్‌ తీసుకుని ప్రయాణించే సదుపాయం కల్పించామన్నారు.