పీవీ రాజేశ్వరరావు మృతి

Posted December 12, 2016

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు, మాజీ ఎంపి, పీవీ రాజేశ్వరరావు(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని సోమాజీగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.