ఒకే సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు….

Posted November 29, 2016

Image result for queen movie remake suhasini revathi and prakash raj
హిందీలో క్వీన్ సినిమా సూపర్ విక్టరీ సాధించింది. కంగనా రనౌత్ యాక్టింగ్ మూవీకి మరింత ప్లస్ అయ్యింది. అంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు సౌత్ లోనూ రాబోతుంది. గతంలో విలన్ గా నటించిన త్యాగరాజన్ .. దీన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

Image result for prakash raj

క్వీన్ సినిమాను త్యాగరాజన్ నాలుగు భాషల్లో చేయబోతున్నాట. విశేషమేంటంటే ఒక్కో భాషలో ఒక్కొక్కరు దర్శకతం చేయనున్నారు. అంటే నాలుగు భాషలకు నలుగురు డైరెక్టర్లన్నమాట. కన్నడలో ప్రకాష్ రాజ్, మలయాళం- తమిళ వెర్షన్లకు రేవతి, తెలుగులో సుహాసిని.. క్వీన్ సినిమాకు దర్శకత్వం చేసే అవకాశముందని సమాచారం. క్వీన్’ పాత్రకు కూడా ఒక్కో భాషలో ఒక్కో ప్రధాన పాత్రధారి ఉంటుందట. తమిళంలో తమన్నా, మలయాళంలో అమలపాల్.. తెలుగుకు మరో హీరోయిన్.. ఇలా కాస్టింగ్ లోనూ ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ జరుగుతోంది.

అసలే రీమేక్ సినిమా. అయినా ఒక్కో భాషకు ఒక్కో డైరెక్టర్. అందరూ పేరున్న వారే. యాక్టింగ్ లో ఇరగదీసే దమ్మున్న వారే. ఇలా దమ్మున్న యాక్టర్లే .. సినిమాకు డైరెక్షన్ చేయబోతున్నారు. అయితే యాక్టింగ్ లో సక్సెస్ అయినంత మాత్రాన డైరెక్షన్ లోనూ రాణించాలని లేదు. అయినప్పటికీ భాషకో డైరెక్టర్… ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోయిన్ గా నటించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే త్యాగరాజన్ స్పెషల్ చబ్బీస్ అనే హిందీ సినిమాను రీమేక్ చేయబోతున్నాడని టాక్. దాన్ని కూడా క్వీన్ తరహాలోనూ పలు భాషల్లో తీసేందుకు ప్లాన్ జరుగుతోందట. అయితే దీనికి మరికొంత సమయం పట్టే అవకాశముంది.