లంక …తెలుగు బులెట్ రివ్యూ

0
61

Posted April 21, 2017 at 17:40

Raasi lanka movie reviewనిర్మాణ సంస్థ: రోలింగ్ రాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
తారాగ‌ణం: రాశి, సాయి రోన‌క్‌, ఐనా సాహ‌, సిజ్జు, సుప్రీత్‌, లీనా సిద్ధు, స‌త్యం రాజేష్‌, స‌త్య త‌దిత‌రులు
సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ: వి.ర‌వికుమార్‌
క‌ళ: హ‌రివ‌ర్మ‌
నిర్మాత‌లు: నామ‌న దినేష్‌, నామ‌న విష్ణుకుమార్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: శ్రీముని

కథ.. కేరళలో ఓ స్టార్ హీరోయిన్ స్వాతి. హైదరాబాద్ వచ్చి తానెవరో చెప్పకుండా ఓ షార్ట్ ఫిలిం లో నటించడానికి ఒప్పుకుంటుంది.ఆ ఫిలిం షూటింగ్ కోసం ఓ బిల్డింగ్ లోకి వెళ్లిన ఆమెని అక్కడ రెబెకా అనే ఆమె చిత్రవిచిత్రంగా తన కంట్రోల్ లో పెడుతుంది.ఓ వైపు షార్ట్ ఫిలిం దర్శకుడు ఆమెని ప్రేమిస్తుంటాడు.ఇంకోవైపు రెబెకా ఇబ్బంది.ఈ పరిస్థితుల్లో స్వాతి అదృశ్యం..అందుకు దారి తీసిన కారణాలు తెలుసుకోడానికి ఈ చిత్రం చూడాలి.

విశ్లేషణ … టెలీపతి అనే విద్య తెలిసిన మనిషి తాను అనుకున్నది సాధించడానికి ఏమి చేసిందన్న సెంట్రల్ పాయింట్ ఆధారంగా ఈ కధ రాసుకున్నారు.అంటే కధకి మూలమే క్లిష్టమైనది. అంటే కధనం ఆ సంక్లిష్టతని పెంచకుండా తగ్గించే విధంగా ఉండాలి.కానీ కధలో సస్పెన్స్ అనే ఎలిమెంట్ ని హైప్ చేయడానికి అవసరం లేని ఉప కథలతో బిగువు పెంచాలని చూసి దాన్ని కలగాపులగం చేసాడు.దీంతో మెయిన్ కధ కూడా ఎక్కడికక్కడ పక్క దారి పడుతున్నట్టు ఉంటుంది. ఈ లేనిపోని సన్నివేశాలు పేక్షకుడి ఆసక్తిని చంపేశాయి.ముందు అనుకున్నట్టు కధకి ప్రాధాన్యమిస్తూ పక్కకి పోకుండా సన్నివేశాలు రాసుకుంటే సినిమా ఇప్పటికన్నా బెటర్ గా ఉండేది.
బలాలు…  సినిమాకి కధ ఎంత బలమైనదో,రాశి అంత ప్లస్ అయ్యింది.చాన్నాళ్ల తర్వాత స్క్రీన్ మీదకి వచ్చిన రాశి కొన్ని సీన్స్,క్లైమాక్స్ అదరగొట్టింది.ఫస్ట్ హాఫ్ లో కామెడీ కూడా ఓకే

బలహీనతలు… దర్శకుడు అనుకున్న కధని ఫాలో కాకుండా ఎక్కడెక్కడో తిరగడం ఈ సినిమాకి పెద్ద మైనస్.
తెలుగు బులెట్ ఫైనల్ పంచ్ …“లంక “అంతా గజిబిజి
రేటింగ్ … 2 . 25 / 5