రాధా,రంగా పేర్లు చెడగొడుతున్నది వీళ్లా ?

Posted December 27, 2016

untitled-7-copy
వంగవీటి సినిమా ప్రకంపనలు ఇంకా ఆగలేదు .సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద ఫిర్యాదులు ,హెచ్చరికలు కొనసాగుతూనే వున్నాయి .అటు వర్మ కూడా శక్తివంచన లేకుండా కౌంటర్ చేస్టున్నాడు .వంగవీటి నిర్మాణ సమయంలో వర్మకి కొద్దోగొప్పో అండగా నిలిచిన రాధారంగా మిత్రమండలి కూడా సినిమా రిలీజ్ అయ్యాక టోన్ మార్చింది.తమకి చెప్పిన ,తమ సమక్షంలో షూటింగ్ జరిగిన దృశ్యాలు సినిమాలో లేవని ఆరోపించింది. రంగా చేసిన సమాజ సేవ గురించి కూడా షూటింగ్ చేసి సినిమాకి కలపాలని రాధారంగా మిత్రమండలి డిమాండ్ చేసింది .

ఈ డిమాండ్ లపై వర్మ ఫైర్ అయిపోయాడు .పనిపాట లేకుండా వీధుల్లో తిరిగే మీలాంటి వాళ్ళతో రాధా ,రంగాలకి చెడ్డ పేరు వస్తోందని వ్యాఖ్యానించాడు.మీరు కేవలం నా దిష్టి బొమ్మల్ని తగలబెట్టగలరు…కానీ నేను పెట్రోల్ కూడా లేకుండా మీ లోపలి కుళ్ళును తగలబెడతానని వర్మ తీవ్ర స్థాయి హెచ్చరికలు చేసాడు.మీరు మొరగడం ఆపకపోతే అసలు గుట్టంతా బయటపెడతానని వార్నింగ్ ఇవ్వడంతో పాటు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చేసాడు వర్మ .