నల్లారి ని రఘువీరా రానిస్తారా..?

Posted December 14, 2016

raghuveera allows nallariనల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.ముఖ్యమంత్రిగా ఈ పేరు ఒకప్పుడు బాగా వినిపించి ఆ తర్వాత రాష్ట్ర విభజన ..నిరాశలో ఉన్న అయన మళ్ళీ క్రియ శీలక రాజకీయాల తిరిగి చూడ లేదు.. సమైక్య ఆంధ్రా కే కట్టుబడి ఉన్నాను విభజన వద్దు అని విభజన ద్వారా వివాదాలు తలెత్తి వైషమ్యాలు వస్తాయని హై కమాండ్ వద్ద తన వాయిస్ ని బలం గా వినిపించి విభజనను అడ్డు కోవాలని శతవిధాలా ప్రయత్నం చేసి అడ్డుకోలేక కాంగ్రెస్ నుంచి బైటికి వచ్చి చివరికి సమైక్య ఆంధ్ర పార్టీ ని పెట్టి ఎన్నికలలో నిలబడి ఓటమిని చవి చూసారు..సమైక్యాంధ్ర కోసం అయన చివరి వరకు చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి.. చిత్తూర్ జిల్లాకి చెందిన వాడే ఐనా నెల్లూరు జిల్లాలో కూడా ఆయనకి పట్టు ఉండటం అందునా అత్త గారి ప్లేస్ కావడం తో నల్లారి కి ఫాలోయింగ్ కూడా ఉందనే చెప్పాలి.

తాజా అప్డేట్ ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో మళ్లీ చురుకైన పోషించాలనుకుంటున్నారట. ఏ పార్టీ లో జాయిన్ అవ్వాలి అనుకొంటున్నారు అనేదే ప్రశ్న . వైఎస్‌ఆర్‌ సి పీ లో అని కొందరు మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వుతారని గుస గుసలు వినిపిస్తున్నాయట.ఈ మధ్య కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన పార్టీ లో వున్నాకొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రఘు వీర సమమక్షం లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారట,నల్లారి కూడా ఇదే బాట లో ఉంటారట.కానీ కాంగ్రెస్ తో విభేదించి బైటకి వెళ్లిన అయన మళ్ళీ అదే పార్టీ లోకి రావడం సాధ్యమేనా అనేది వస్తే ఆయనకి ఏ పదవిని ఇవ్వాలి .స్పీకర్ గా ముఖ్య మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది ఇలా…పలు సమస్యలు తలెత్తి వివాదం తలెత్తే పరిస్థితి . దీంతో పీసిసి చీఫ్ గా ఉన్న రఘువీరా రెడ్డి నల్లారిని రానిస్తారా ? అనే అనుమానం రాక మానదు .పదవికోసం దిగజారే పరిస్థిలు చూస్తున్నాం. శత్రువు శత్రువు మిత్రుడు అన్న చందం గా రఘువీరా యాంటీ వర్గం ఎలా ఐనా నల్లారిని దింపి రఘువీరా కి చెక్ పెట్టాలని చూస్తోంది.కిరణ్ ఏ పార్టీ లో జాయిన్ ఐనా అయినా గుర్తింపు ఉండేలా వ్యవహరించాలని ..ఇంకా టైం వుంది కదా పరిస్థితిని బట్టి చక్రం తిప్పొచు కదా అనే టాక్ కూడా వుంది….లెట్ అజ్ వెయిట్ అండ్ సీ..పాలిట్రిక్స్ కదా..!