మోడీని ఢీకొట్టలేకపోతున్న రాహుల్

Posted December 9, 2016

rahul gandhi does not reached to modi in talking power and decision
ప్రధాని నరేంద్రమోడీ వర్కింగ్ స్టైల్ అటాకింగ్ గా ఉంటుంది. ఏ విషయంలోనైనా కొంచెం దూకుడు ప్రదర్శిస్తారు. అదే రాహుల్ గాంధీ విషయాన్ని తీసుకుంటే ఆయన చాలా లైట్. అంశం ఎంత సీరియస్ అయినా ఆయన చాలా లేటుగా స్పందిస్తారు. దీంతో ఇద్దరి మధ్య పోలికల విషయానికొచ్చేసరికి మోడీ, రాహుల్ మధ్య తేడా ఆమ్ ఆద్మీ కూడా అంచనా వేయగలుగుతున్నాడు.

ప్రస్తుతం కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. అయితే నోట్ల రద్దు అంశం కాంగ్రెస్ కు సువర్ణావకాశంలా వచ్చింది. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో రాహుల్ బాబా ఘోరంగా విఫలమయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో మాట్లాడకుండానే పని కానిచ్చేస్తుంటే.. రాహుల్ అయినా సభలో మాట్లాడితే బావుంటుంది. ప్రభుత్వ తప్పులను నిలదీస్తే ప్రజల్లోనూ మైలేజ్ వస్తుంది. కానీ ఇవన్నీ మరిచి రాహుల్ తన పార్టీ సభ్యులను బాగా రభస చేయాలని చెబుతున్నారట.

నోట్ల రద్దు అంశంలో మోడీ చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తుంటే.. దాని తప్పులపై మాట్లాడి ప్రభుత్వానికి బ్రేకులు వేయడంలో రాహుల్ అట్టర్ ఫ్లాపయ్యారు. పార్టీ బాధ్యతలన్నీ ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నారు. సలహాలిచ్చే సీనియర్లున్నారు. అయినా ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన విఫలమవుతున్నారు. మోడీని ఢీకొట్టడంలో వెనుకబడిపోతున్నారు. ఈ రేసులో మోడీ ఆకాశంలో ఉంటే.. రాహుల్ ఇంకా నేలపైనే ఉన్నాడని సెటైర్లు వేస్తున్నారు బీజేపీ నాయకులు. అసలు మోడీని ఢీకొట్టే స్థాయి రాహుల్ కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ నాయకులు కూడా కొంచెం జంకుతున్నారని ప్రచారం జరుగుతోంది.