20 ఏళ్ళ తర్వాత కళ్ళు తెరిచిన రైల్వే శాఖ…

Posted December 23, 2016

railway improvements to injured people

రెండు దశాబ్దాల తర్వాత రైల్వే శాఖ కళ్ళు తెరిచింది..ఇటీవల కాన్పూర్ వద్ద జరిగిన ప్రమాదం తర్వాత భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకొంది. ప్రమాదం లో గాయపడిన, మృతిచెందిన వారికీ ఆ శాఖ నుంచి అందించే పరిహారంపై సవరణలు చేసేందుకు నడుం కట్టింది. తాజా నిర్ణయాలు 2017 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న రూ.4 లక్షలకు బదులు రూ.8 లక్షలు పరిహారం అందిస్తారు అంటే తాజా నిర్ణయం ప్రకారం రెట్టింపు పరిహారం.

తీవ్రంగా గాయపడినా, కాలు, చెయ్యి వంటి శరీర అవయువాలను కోల్పోయినా కంటి చూపు, వినికిడిశక్తి కోల్పోయిన వారికి కూడా రూ.8 లక్షలు పరిహారం చెల్లిస్తారు. అంతే కాకుండా 34 రకాల గాయాలకు ప్రస్తుతమున్న దానికంటే రెట్టింపు మొత్తంలో రూ.7.2 లక్షల నుంచి రూ.64 వేల వరకు అందిస్తారు. ‘రైల్వే ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనల (పరిహారం) నిబంధనలు -1997’కు సవరణ చేసింది. చివరిసారిగా 1997లో పరిహారాలను సవరించిన రైల్వే శాఖ మళ్లీ 19 ఏళ్ల తర్వాత..1997 తర్వాత మళ్లీ ఇప్పటి వరకు పరిహారాలను పెంచలేదనీ..కాన్పూర్ ప్రమాదం తరువాత పరిహారం పై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల బోంబే హైకోర్టు ఆదేశించింది. కోర్ట్ ఆదేశాల మేరకు ఈ సవరణ చేసారు ..