ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్…!

Raj Tarun Hebha Patel In Serious Relationబాలీవుడ్ లో ఓ హీరో హీరోయిన్ కలిసి సినిమాలో రొమాన్స్ ఎక్కువ చేస్తే చాలు ఆ ఇద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ జరుగుతుందని హడావిడి చేస్తారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా ఓ జంట పరిస్థితి అలానే ఉంది. ఇద్దరు కలిసి నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో హాట్ పెయిర్ గా మారిన ఈ జంట ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నదట. అయితే విషయం బయటకు చెప్పకపోయినా ఇద్దరి నడవడిక అలానే ఉందని అంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే కుమారి హెబ్భా ఆ సినిమాలో హీరో రాజ్ తరుణ్.

ఇండస్ట్రీకి సోలోగా వచ్చి సూపర్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్ కుమార్ సినిమాతో హెబ్భాతో ఏర్పరచుకున్న పరిచయం సీరియస్ రిలేషన్ గా మార్చుకున్నాడట. ఈ ఇయర్ మొదట్లోనే ఈడోరకం ఆడోరకం అంటూ వచ్చి మరోసారి ప్రేక్షకులను అలరించిన ఈ జంట ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తుందట. అయితే మొదటి సినిమా నుండి పరిచయమైన వ్యక్తులు కావడంతో ఇద్దరు సెట్స్ లోనే కాదు బయట కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నారట.

అది చూసిన కొందరు ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనేస్తున్నారు. మరి ఈ విషయం త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిది లేదంటే ఇద్దరి కెరియర్ మీద ఈ ఎఫైర్ ప్రభావం చూపే అవకాశం ఉంది.