రాజమౌళి పర్యవేక్షణలో రాజధాని..!

Posted December 8, 2016

Rajamouli Help To Amaravathi Capital Cityఅదేంటి రాజమౌళికి రాజధానికి ఏంటి సంబంధం అంటే రాజమౌళి మీద చంద్రబాబుకి ఉన్న నమ్మకం మీద కొత్త రాజధాని అమరావతికి సంబందించిన పనులలో సాయం తీసుకోవాలని చూస్తున్నారు. రాజమౌళి ఐడియాలజీ సూపర్బ్ గా ఉంటుంది ఇక తన సినిమాల్లో సెట్టింగులైతే ఒరిజినల్ గా ఉన్నాయా అన్నంత రేంజ్లో కనిపిస్తాయి. అదే చంద్రబాబుకి ఆకర్షించాయి.

ప్రస్తుతం నిర్మిస్తున్న రాజధానికి రాజమౌళి సహకారం తీసుకోవాలని సి.ఆర్.డి.ఏ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జక్కన్నకు చరిత్ర మీద ఉన్న దృష్టిని మెచ్చే ఈ అవకాశం ఇస్తున్నాడట. ముఖ్యంగా శాసనసభ, హైకోర్ట్ ఎలా ఉండాలి అన్న విషయం మీద అధికారులు రాజమౌళితో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఓ పక్క దర్శకుడిగా అగ్రస్థానంలో వెళ్తూ మరో పక్క ప్రభుత్వానికి ఈ విధంగా సలహాదారునిగా పనిచేయడం కేవలం ఒక్క రాజమౌళి వల్లే అయ్యిందని చెప్పాలి.