ఆ మూవీ సీక్వల్ ప్లాన్ లో రాజమౌళి..!

Posted November 16, 2016

Rajamouli Planning vikramarkudu Sequel Movieదర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి పార్ట్-2 తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అయితే బాహుబలి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలికి సీక్వల్ లానే రాజమౌళి డైరక్షన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాకు సీక్వల్ కథ రాశాడట. కథ విన్న రాజమౌళి సూపర్ అనేయడంతో ఇప్పుడు బాహుబలి తర్వాత జక్కన్న తీసే సినిమా విక్రమార్కుడు-2 అని హడావిడి చేయడం మొదలు పెట్టారు.

మాస్ మహరాజ్ రవితేజలోని సీరియస్ నెస్ ను.. మరో పక్క జింతాక్ జింతాక్ అంటూ కామెడీని రెండు సమపాళ్లలో పండించేలా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు రాజమౌళి. బాహుబలితో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి విక్రమార్కుడు సీక్వల్ తీస్తే అది కూడా ఓ రేంజ్లో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. రవితేజ డ్యుయల్ రోల్ చేసిన ఆ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. మరి జక్కన్న విక్రమార్కుడు-2 షురూ అయితే ప్రస్తుతం కెరియర్ అటు ఇటుగా ఉన్న రవితేజకు ఓ కొత్త జోష్ వచ్చేసినట్టే.