వర్మ ఫంక్షన్స్ కు రాజమౌళి ప్రభాస్..!

Posted December 19, 2016

Rajamouli Prabhas Attend RGV Function

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన వంగవీటి ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. అయితే సినిమా మొదలు పెట్టిన రోజు నుండి సంచలనంగా మారిన వంగవీటి సినిమా వర్మ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయిన వంగవీటి మరింత క్రేజ్ సంపాదించేలా డిసెంబర్ 20న శివ టూ వంగవీటి సిని ప్రస్థానంతో ఓ స్పెషల్ ఈవెంట్ జరుపుతున్నారు. అయితే ఈ ఈవెంట్ కు ముందు అమితాబ్ లాంటి స్టార్స్ వస్తున్నారంటూ హడావిడి చేశారు మరి ఏమైందో ఏమో కాని అమితాబ్ బదులు బాహుబలి వస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ కు స్పెషల్ గా ఇన్విటేషన్ పంపించడంతో ఈ ఈవెంట్ కు ప్రభాస్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభాస్ తో పాటుగా ఈ కార్యక్రమానికి రాజమౌళి కూడా వచ్చే అవకాశాలున్నాయట. వర్మతో పనిచేసిన టెక్నికల్ టీం అంతా ఈ ప్రోగ్రాం లో పాటిస్పేట్ చేస్తున్నట్టు టాక్. ఇక వీరే కాకుండా అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ కూడా అటెండ్ అవుతారట. ఇదంతా వంగవీటి సినిమాకే చేస్తున్నాడు అంటే కచ్చితంగా తన స్టామినా తెలియచేసే ప్రయత్నంలో భాగమే అంటున్నారు.

ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన వంగవీటి సినిమా సెన్సార్ ఏ సర్టిఫికెట్ సంపాదించింది. వర్మ పర్సనల్ గా తీసుకుని చేసిన ఈ సినిమాలో కుటుంబ రాజకీయాల కన్నా కుల రాజకీయాల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. వర్మ కోసం రాజమౌళి కూడా రావడంతో ఈ ఈవెంట్ లో వర్మ గురించి రాజమౌళి.. రాజమౌళి గురించి వర్మ ఎలా మాట్లాడుతారో అని ఎక్సయిటింగ్ గా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.