ఆ విషయం ముందే తెలిస్తే ‘బాహుబలి’ చేసేవాడిని కాదు : రాజమౌళి

0
68

Posted April 27, 2017 at 14:03

rajamouli says about bahubali movie starting days and shooting days ending days
తెలుగు సినిమా ఖ్యాతిని ‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన టాలీవుడ్‌ జక్కన్న రెండవ పార్ట్‌ విడుదల సందర్బంగా తెలుగు ప్రింట్‌ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంగా మీడియా మిత్రులతో జక్కన్న పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. బాహుబలి ఎలా మొదలైంది, మొదట ఎలా అనుకున్నాను అనే విషయాలను జక్కన్న చెప్పుకొచ్చాడు. ‘బాహుబలి’ విషయంలో ఏది తాను మొదట అనుకున్నట్లుగా జరగలేదని, అన్ని విషయాు కూడా నేను ఊహించని విధంగా జరుగుతూ వచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా జక్కన్న మాట్లాడుతూ.. అయిదు సంవత్సరాల క్రితం ‘బాహుబలి’ సినిమాను ప్రారంభించేప్పుడు ఇంత పెద్ద సినిమాగా ఇది నిలుస్తుందని తాను ఊహించలేదు. కేవలం రెండు సంవత్సరాల్లో ఒక భారీ సినిమాను తీయాలని భావించాను. కాని అది కాస్త అయిదు సంవత్సరాలు అయ్యింది. అయిదు సంవత్సరాల పాటు ‘బాహుబలి’ టైం తీసుకుంటుందని ముందే ఊహించి ఉంటే ఖచ్చితంగా అంత సాహసం చేసే వాడిని కాదని రాజమౌళి పేర్కొన్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే టాపిక్‌ ఇంత ప్రాచుర్యం అవుతుందని కూడా ఊహించలేదు. మొదటి పార్ట్‌ 150 నుండి 200 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందని అంతా భావించాం. కాని ఊహకు మించిన వసూళ్లు రావడం సంతోషం అనిపించింది. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదల అయిన వెంటనే రెండవ పార్ట్‌ అంటే నాలుగు నెలల్లోనే విడుదల చేయాలని భావించాం. కాని గ్రాఫిక్స్‌ వర్క్‌తో పాటు షూటింగ్‌ కార్యక్రమాలు ఆలస్యం అవుతూ రావడంతో సినిమా ఆలస్యం అయ్యిందని చెప్పుకొచ్చాడు.