ఎన్టీఆర్ ని రాజమౌళి తిట్టుకున్నది అందుకే..

0
105

Posted September 28, 2016

 rajamouli scold ntr
దర్శక ధీరుడు రాజమౌళి 15 ఏళ్ల నాటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు.తాను దర్శకుడిగా,ఎన్టీఆర్ హీరో గా పరిచయం అయిన స్టూడెంట్ no 1 సినిమా సంగతుల్ని గుర్తు చేసుకున్నారు.ఆ సినిమా హిట్ కావడానికి ప్రధాన కారణం పృథ్వీతేజ స్క్రిప్ట్,కీరవాణి మ్యూజిక్ అని చెప్పారు.ఇక అదే సినిమాతో పరిచయమైన ఎన్టీఆర్,తాను అక్కడక్కడా మెరిసామని …తమలో అప్పటికి పరిణితి లేదని అయన ఒప్పుకున్నారు.ఇక షూటింగ్ నాటి విశేషాలు కొన్ని బయటపెట్టారు రాజమౌళి.

షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు తనకి,ఎన్టీఆర్ కి ఒకే రూమ్ ఇచ్చారని …తనకి 9 గంటల కల్లా నిద్రపోయే అలవాటు ఉండేదని..తారక్ మాత్రం 12 గంటల దాకా టీవీ చేసేవాడని రాజమౌళి చెప్పాడు.అక్కడ వచ్చే ఒకే ఒక్క ఛానల్ వ్యవసాయానికి సంబంధించిందని..అదికూడా స్విస్ లోవచ్చేదని..అయినా అది కూడా తారక్ చూడ్డం గుర్తొస్తే ఇప్పటికీ తిట్టుకుంటానని రాజమౌళి మనసులో మాట బయటకి చెప్పాడు.సినిమా హిట్ అయ్యి విజయయాత్ర కి వెళ్ళినప్పుడు జనం లో తారక్ కి వున్న ఆదరణ తెలిసిందని రాజమౌళి వివరించారు.19 ఏళ్ల కుర్రోడిని అదే ఎన్టీఆర్ ని చూసేందుకు పెద్దోళ్ళు ,మాస్ తరలిరావడం చూశానని రాజమౌళి గత స్మృతుల్ని నెమరు వేసుకున్నాడు.ఆ సినిమా లోపని చేసే అవకాశం రావడం మా లాంటి కొత్తవాళ్లు అదృష్టమని రాజమౌళి ఫ్లాష్ బ్యాక్ కి ముగింపు ఇచ్చారు.