జక్కన్న తదుపరి చిత్రం తేలిపోయింది

0
111
rajamouli upcoming film
 Posted April 30, 2017 at 16:46
rajamouli upcoming filmప్రతిష్టాత్మకంగా ‘బాహుబలి 2’ చిత్రాన్ని తెరకెక్కించి సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రాజమౌళి తదుపరి చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా వివిధ భాషల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న రాజమౌళి తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో రాజమౌళి నిర్మాత డీవివి దానయ్యతో ఒక చిత్రాన్ని చేస్తానని మాట ఇచ్చాడు. తాజాగా జక్కన్న ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడని సమాచారం అందుతోంది. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కే సదరు చిత్రంలో హీరో ఎవరు అనేది హాట్‌ టాఫిక్‌గా మారింది.
 
దేశ వ్యాప్తంగా దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రాజమౌళి తదుపరి చిత్రంలో హీరో ఎవరు అని అంశంపై ఫిల్మ్‌ నగర్‌లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి తదుపరి చిత్రంలో హీరోగా స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘డీజే’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత బన్నీ వేరే చిత్రానికి ఫిక్స్‌ అయ్యాడు కానీ రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ముందుగా ఒకే చేసిన దర్శకుడికి నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వార్త విన్న బన్నీ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం క్లారిటీ సమాచారం ఇప్పటి వరకు లేదు. రాజమౌళి చిత్రం కాబట్టి అధికారిక సమాచారం వచ్చే వరకు దేన్ని గట్టిగా నమ్మలేం.