ఇంత తేడాను జక్కన్న ఎలా కవర్‌ చేశాడో?

0
53

Posted April 19, 2017

rajamoulii made anushka changes
‘బాహుబలి’ సినిమా ఎప్పుడో అయిదు సంవత్సరాల క్రితం ప్రారంభించారు. షూటింగ్‌ ప్రారంభం అయ్యి నాలుగు సంవత్సరాలు దాటింది. అయితే అప్పటికి ఇప్పటికి మనుషుల్లో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్‌ మాత్రం ఆ నాలుగు సంవత్సరాలు ఒకేలా ఉండేందుకు చాలా కష్టపడ్డాడు. ప్రభాస్‌లో రెండు పాత్రలకు తగ్గట్లుగా మార్పులు వచ్చాయి, కాని ఇతర మార్పు అయితే కనిపించలేదు. కాని అనుష్క విషయంలో మాత్రం పూర్తి రివర్స్‌ అయ్యింది. అనుష్కను మొదటి పార్ట్‌లో చూపించింది చాలా తక్కువ. అయినా కూడా ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదలకు ముందే రెండవ పార్ట్‌ చిత్రీకరణ జరిపారు. మొదటి పార్ట్‌విడుదల తర్వాత కూడా అనుష్కతో కొన్ని సీన్స్‌ మరియు పాటలు చిత్రీకరించారు.

‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదల తర్వాత అనుష్క సైజ్‌ జీరో చిత్రం కోసం దాదాపు వంద కేజీలు అయ్యింది. ఆ సమయంలో అనుష్క భారీ అందాలు చూసి షాక్‌ అయ్యారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ‘బాహుబలి’ కోసం తగ్గాల్సిందిగా రాజమౌళి ఆదేశించాడు. ఎంతగా ప్రయత్నించినా కూడా తగ్గక పోవడంతో లావుగా ఉన్నట్లుగానే షూటింగ్‌ చేశాడు జక్కన్న. ‘బాహుబలి 2’లోనే రెండు రకాలుగా అనుష్క కనిపించబోతుంది. మీరు పైన చూస్తున్న ఫొటోలో అనుష్కలోని వేరియేషన్స్‌ క్లీయర్‌గా తెలుస్తుంది. అనుష్కలోని ఇంత మార్పును జక్కన్న సినిమాలో ఏమైనా మ్యానేజ్‌ చేసి ఉంటాడా అనేది చూడాలి. ఒకే సినిమాలో అనుష్క రెండు రకాలుగా కనిపిస్తే విమర్శలు రావడం ఖాయం. అన్ని విషయాలను పర్‌ఫెక్ట్‌గా చూసుకునే జక్కన్న అనుష్క విషయంలో మాత్రం ఫ్లాప్‌ అయ్యాడు అనే టాక్‌ వినాల్సి వస్తుందేమో సినిమా విడుదలైతే కాని చెప్పలేం.