సాక్షికి పోటీ ఛానల్…రేసులో జగన్ ఫ్రెండ్?

0
101

Posted April 20, 2017 at 12:16

rajampet mp mithun reddy start new tv channel in ap
ఎలక్ట్రానిక్ మీడియా నష్టాల్లో నడుస్తోందని తెలిసినా చాలా మందికి దాని మీద మోజు మాత్రం తగ్గడం లేదు.అయితే మీడియా ని పూర్తిగా వ్యాపార కోణంలోనే చూస్తున్నవారు మాత్రం ఛానల్ మాట ఎత్తడం లేదు.వాళ్ళ దృష్టంతా ఇప్పుడు బుల్లి తెర మీద కాకుండా బుజ్జితెర మీదకి వెళ్ళింది.అదేనండి …డిజిటల్ మీడియా,యు ట్యూబ్ చానెల్స్ వగైరా..అయితే కొందరు రాజకీయ నేతలకు మాత్రం ఇంకా ఛానెల్స్ మోజు పోలేదు.ఛానల్ చేతిలో ఉంటే జనం అభిప్రాయాన్ని మార్చవచ్చని కలలు కంటున్నారు.అందుకే డబ్బు పోతుందని తెలిసినా ఛానల్ నిర్వహణకు ముందుకొస్తున్నారు.తెలంగాణాలో ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికే రాజ్ న్యూస్ లీజ్ కి తీసుకుని ఉద్యోగుల నియామకం కూడా చేపట్టారు.ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ కొత్త ఛానల్ రాబోతున్నట్టు తెలుస్తోంది.ఈ ఛానల్ సాక్షికి పోటీగా వైసీపీ భజన చేయబోతోంది.

వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి,ఆయన కుమారుడు,జగన్ స్నేహితుడు,రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ఏపీ లో కొత్త ఛానల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.డిజిటల్ మీడియా లో వైసీపీ హవా కొనసాగుతున్నప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో టీడీపీ ధాటికి తట్టుకోలేకపోతున్నామని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు.అందుకే ఆయనే పార్టీ కి అనుకూలంగా వుండే ఇంకో ఛానల్ పెట్టమని తన స్నేహితుడు మిధున్ రెడ్డి ని ప్రోత్సహించినట్టు తెలుస్తోంది.ఈ ప్లాన్ కార్యరూపం దాలిస్తే త్వరలో ఏపీ లో సాక్షికి ధీటుగా జగన్ భజన చేసే ఛానల్ మొదలైనట్టే..