మోడీ కి మంట పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే ..

Posted November 17, 2016

rajasthan mla bhawani singh said Ambani, Adani Knew of Currency bannedనోట్ల రద్దుకు సంబంధించి బడాబాబులకు ముందే సమాచారం అందిందన్న అనుమానాలున్న తరుణం లో , రాజస్థాన్ లోని అధికార బీజేపీ పార్టీ ఎమ్మెల్యే భవాని సింగ్ చేసిన వ్యాఖ్యానాలు కలకలం రేపు తున్నాయి , అంబానీ, అదానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలకు ముందుగా ఈసమాచారం తెలుసనీ కోటా జిల్లాకు చెందిన లాడ్‌ పూరా ఎమ్మెల్యే భవాని సింగ్‌ రాజావత్‌ అన్నారు. విలేకరుల ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఆన్‌ లైన్‌ లో ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది.

కొత్త నోట్ల నాణ్యత గురించి కూడా ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ’కొత్త కరెన్సీ నోటు నాసిరకంగా ఉంది. దీన్ని చూస్తే నకిలీ నోటు అన్న భావన కలుతుతుంద’ని అన్నారు.అయితే ఈ వీడియో బయటకు రావడంతో ఆయన మాట మార్చారు. కొంతమంది జర్నలిస్టులతో పిచ్చాపాటిగా తాను మాట్లాడిన దాన్ని వక్రీకరించారని అన్నారు.