అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్..!

Posted November 21, 2016

Rajinikanth 2.0 First Look Releaseసౌత్ ఇండియన్ సూపర్ డైరక్టర్స్ లో శంకర్ ఒకరు. రోబోతో తన సత్తా చాటుకున్న శంకర్ దానికి సీక్వల్ గా 2.0 రూపొందిస్తున్నారు. 340 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్న ముంబైలో రిలీజ్ చేశారు. రజిని రోబో లుక్ తో పాటుగా అక్షయ్ కుమార్ విలన్ లుక్ అందరిని ఇంప్రెస్ చేసింది. అంతేకాదు సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసి పోకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రపంచం ఉంది మనుషులకే కాదు అన్న ట్యాగ్ తో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసిన శంకర్ సినిమాను కూడా అదే రేంజ్ సర్ ప్రైజ్ ఇస్తాడని తెలుస్తుంది. 2017 దీవాళికి రిలీజ్ అవుతున్న ఈ సినిమ ఫస్ట్ లుక్ నుండే ప్రకంపణలు స్టార్ట్ చేసింది.