తలైవాకు లాస్ట్ పొలిటిక‌ల్ ఛాన్స్!!

Posted December 5, 2016

rajinikanth last chance of political entry
సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని ఎప్ప‌ట్నుంచో ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశ‌లను అడియాస‌లు చేస్తూ ఎప్పుడూ త‌లైవా మాత్రం దానిపై ఎప్పుడూ క్లారిటీ ఇవ్వ‌లేదు. వ‌స్తాన‌ని గానీ.. అలాగ‌ని రాన‌ని గానీ ఎప్పుడూ స్టేట్ మెంట్ ఇవ్వ‌లేదు. ప్ర‌తి ఎల‌క్ష‌న్ల ముందు రజినీకాంత్ వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డం.. ఆ త‌ర్వాత ఆయ‌న నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేక‌పోవ‌డం చూసి జ‌నాల‌కు కూడా దానిపై ఇంట్రెస్ట్ పోయింది. ఇక ర‌జినీ పాలిటిక్స్ లోకి రాన‌ట్టే అనుకుంటున్న త‌రుణంలో… మ‌రోసారి ఆయ‌న ఎంట్రీ గురించి చెప్పుకుంటున్నారు.

పురుచ్చిత‌లైవి జ‌య‌ల‌లిత హెల్త్ కండిష‌న్ తో ఇప్పుడు అన్నాడీఎంకే డైలమాలో ప‌డింది. అస‌లు జ‌య త‌ర్వాత ఏంట‌ని ఆలోచిస్తే.. వారికి ఏం తోచ‌ట్లేదు. ఈ త‌రుణంలో అన్నాడీఎంకే లాంటి అధికారంలో ఉన్న పార్టీకి ర‌జినీకాంత్ లాంటి ఛ‌రిష్మా ఉన్న సెల‌బ్రిటీ అయితే బాగుంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళ పాలిటిక్స్ లోకి రాక‌పోయినా.. ఆయ‌న‌కు కొంచెం అవ‌గాహ‌న ఉంది. సో అన్నాడీఎంకే లాంటి పార్టీని న‌డ‌ప‌డం ఆయ‌న క‌ష్టం కూడా కాక‌పోవ‌చ్చు. అందువ‌ల్ల ఇప్ప‌టికైనా పాలిటిక్స్ ఎంట్రీపై ఆయ‌న స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని అభిమానులు ఒత్తిడి తెస్తున్నార‌ట‌.

ర‌జినీకాంత్ పాలిటిక్స్ కు రావాలంటే ఇదే స‌రైన త‌రుణం. అటు ప్ర‌తిప‌క్షం స‌రిగా లేదు. ఇటు అన్నాడీఎంకేకు భ‌రోసా ఇచ్చే నాయ‌కుడు లేడు. ఇలాంటి త‌రుణంలో నేనున్నాన‌ని త‌లైవా ముందుకొస్తే ఆయ‌న్ను కాద‌నే వారు ఎవ‌రూ లేరు. ఒక‌వేళ ఇప్ప‌టికైనా ఆయ‌న రాక‌పోతే మాత్రం మంచి అవ‌కాశం మిస్ చేసుకున్న‌ట్టేన‌ని చెబుతున్నారు. ఒక‌రకంగా చెప్పాలంటే ఇది ఆయ‌న‌కు లాస్ట్ ఛాన్స్ లాంటిది. ఉప‌యోగించుకుంటే ఆయ‌న లైఫ్ మ‌రో ట‌ర్న్ తీసుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు ప‌రిశీల‌కులు.