సంజయ్ లీలా బన్సాలీపై ఎటాక్..

Posted January 28, 2017

rajput karni sena attack on sanjay leela bhansaliబాజీరావ్ మస్తానీ వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రస్తుతం పద్మావతి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఈ దర్శకుడిపై దాడి జరిగింది. పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ దాడి చేసింది రాజ్ పుత్ కర్నిసేన.

ప్రస్తుతం ఈ  సినిమా షూటింగ్ రాజస్ధాన్ లోని జైగడ్ కోటలో జరుగుతోంది. విషయం తెలుసుకున్న కర్నిసేన.. సినిమాలో పద్మావతి గురించి తప్పుగా చూపిస్తున్నారని, అల్లావుద్దీన్ ఖిల్జీతో పద్మావతి ప్రేమాయణం జరిపినట్టుగా చరిత్రను వక్రీకరిస్తున్నారని  ఆందోళనకు దిగింది. అంతటితో  ఆగకుండా   కెమెరా, లైట్లు బద్దలుకొట్టారు కర్నిసేవకులు. అదే సమయంలో డైరెక్టర్‌ భన్సాలీపై కూడా  చేయిచేసుకున్నారు, ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. కర్నిసేన కార్యకర్తలను అడ్డుకుని, భన్సాలీని రక్షించే ప్రయత్నం చేసింది చిత్రయూనిట్.

రాజపుత్రుల సంస్కృతి సంప్రదాయాల విషయంలో చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని,  ఇదే జరిగతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కర్ని సేవకులు. ఈ ఘటనపై సంజయ్ లీలా బన్సాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.