మహేష్ సినిమా రకుల్ కష్టాలు..!

mb1816టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ధ్రువ షూటింగ్ కంప్లీట్ చేసుకుని మహేష్ మురుగదాస్ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే మహేష్ తో పాటుగా పనిచేస్తున్న యూనిట్ అందరికి తెలుగుతో పాటు తమిళ్ కూడా వచ్చట. ఇక ఎటుకూడి రకుల్ మాత్రమే తమిళంలో డైలాగులు చెప్పలేక ఇబ్బందులు పడుతుందట.

తెలుగు కొంతమేరకు అలవాటు అయినా తమిళ భాషతో కాస్త ఇబ్బంది పడుతుందట రకుల్. అందుకే తన సీన్ పేపర్ ముందే అడిగి తీసుకుని బట్టి పట్టి రోజు షూటింగ్ కు వస్తుందట. మరి అంత కష్టపడుతుంది కాబట్టే అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యింది. వరుసెంట స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తున్న రకుల్ చూస్తుంటే టాప్ చెయిర్ దక్కించుకోవడంలో ఇంకెంత దూరంలోనే లేదనిపిస్తుంది. ఈ రేంజ్ కష్టపడుతున్న ఈ అమ్మడు చేస్తున్న సినిమాలన్ని సూపర్ హిట్ అందుకుంటే టాప్ చెయిర్ వద్దన్నా ఆమె సొంతమే అవుతుంది.