‘ఖైదీ నెం.150’లో చిరుత కూడా !

0
119

Posted October 15, 2016

 ram charan act chiru khaidi number 150 movie

మెగా హంగామా మొదలైంది. మెగా అభిమానులంతా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైది నెం. 150’ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు, అభిమానుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా ఖైదీని ముస్తాబు చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు వినాయక్. ప్రస్తుతం లారెన్స్ కంపోజ్ చేసిన ఐటమ్ సాంగ్ లో చిందులు వేస్తున్నాడు మెగాస్టార్. మెగా ఐటమ్ గా లక్ష్మీరాయ్ కనిపించబోతోంది.

అయితే, మెగా ‘ఖైదీ’లో మెగా ప్యాకేజీ ఉంటుందని మెగా అభిమానులు ఆశపడుతున్నారు.మెగా యంగ్ హీరోలంతా ఖైదీ నెం. 150లో తళుక్కుమంటే
బాగుంటుందన్నది వారి ఆశ. ఇందుకోసం మెగా హీరోలు కూడా రెడీ ఉన్నారు. బన్ని, తేజు, వరుణ్ తేజు, శిరీష్.. లాంటి వారు మెగా ఖైదీ కోసం చిరు, వినాయక్ ల దగ్గర అప్లికేషన్ కూడా పెట్టుకొన్నామని చెబుతున్నారు. వీరి సంగతి ఏమో గానీ.. మెగా ఖైదీలో రాంచరణ్ మెరవడం ఖాయమైనట్టు సమాచారమ్.

ప్రత్యేక పాత్రలో కాకున్న ప్రత్యేక పాట (ఐటమ్ సాంగ్)లో మెగాస్టార్ తో కలసి చెర్రీ చిందేయనున్నాడట. స్పెషల్ సాంగ్ ప్రాక్టీస్ లోనూ చెర్రీ పాల్గొన్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ న్యూస్ తో మెగా ఖైదీలో చిరుత కూడా ఉందని మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.