బాహుబలిపై మగధీరుడి కామెంట్స్‌

0
43

 Posted May 3, 2017 at 17:59

ram charan comments on bahubali 2 movie
జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా ఇండియాస్‌ నెం.1 బిగ్గెస్ట్‌ సినిమాగా నిలవడం ఖాయం అని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఇలా అన్ని భాషల సినీ ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు అందుకున్న బాహుబలి సినిమాకు తాజాగా మగధీరుడు రామ్‌ చరణ్‌ ప్రశంసలు కూడా దక్కాయి.

తాజాగా ‘బాహుబలి 2’ సినిమా ప్రత్యేక షో ద్వారా చూసిన రామ్‌ చరణ్‌ ప్రశంసలు కురిపించాడు. రాజమౌళి అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో పాటు, అద్బుతమైన విజువల్స్‌ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకు వెళ్లిందని చరణ్‌ చెప్పుకొచ్చాడు. ఇక డార్లింగ్‌ ప్రభాస్‌ అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. నా మిత్రుడు రానా కెరీర్‌లోనే ఉత్తమ నటనను ఇచ్చాడు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు కూడా అద్బుతమైన నటనను కనబర్చారు అంటూ రామ్‌ చరణ్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. ఒక గొప్ప సినిమా అన్ని హద్దులను చెరపేస్తుందని ఈ సినిమా నిరూపించిందంటూ చరణ్‌ పేర్కొన్నాడు. ‘బాహుబలి 2’పై ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.