10 సెకన్ల ప్రోమోతో అదరగొట్టిన చరణ్..!

Posted November 4, 2016

drv1416మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమాకు సంబందించి 10 సెకన్ల సాంగ్ టీజర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నీతోనే డ్యాన్సునై.. నీతోనే డ్యాన్సునై అంటూ సాగే ఈ 10 సెకన్ల సాంగ్ టీజర్ లోనే సినిమాలో ఏ రేంజ్ డ్యాన్సులుంటాయో చూపించాడు చెర్రి. తమిళ సూపర్ హిట్ సినిమా తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.

రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఈ షార్ట్ టీజర్ మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది. ఇక ఈ టీజర్ తో పాటుగా రేపు ఉదయం మరో సాంగ్ టీజర్ రిలీజ్ చేయనున్నారట. ఇక ఆడియోను కూడా డైరెక్ట్ గా ఆన్ లైన్లో రిలీజ్ చేసి ప్రి రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మెగా పవర్ ఏంటో చూపించాలని చరణ్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా చరణ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.