ధ్రువ సెన్సార్ రిపోర్ట్..!

Posted November 21, 2016

ram charan dhruva censor reportమెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. వారం క్రితం దాకా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఈరోజు ఉదయం సెన్సార్ స్క్రూట్నీకు వెళ్లింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ తని ఒరువన్ రీమేక్ గా వస్తుంది. సినిమాకు సెన్సార్ వాళ్లు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు సెన్సార్ సభ్యుల నుండి బెస్ట్ విశెష్ కూడా అందుకున్నారట.

ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో నింపగా సెకండ్ హాఫ్ లో సినిమా సబ్జెక్ట్ ను నడిపించారట. తమిళ సినిమాకు ఈ సినిమాకు చాలా మార్పులు చేశారట. బ్రూస్ లీ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కాబట్టి ఆ సినిమా మిగిల్చిన నిరాశ ఈ సినిమా హిట్ కొట్టి తీర్చుకోవాలని చూస్తున్నారు మెగా అభిమానులు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చరణ్ చాలా కొత్తగా ఉంటాడట.

నవదీప్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగా ప్రొడక్షన్ వాల్యూస్ లో మరోసారి గీతా ఆర్ట్స్ తన సత్తా చాటిందట. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా చరణ్ ఎకౌంట్ లో ఓ సూపర్ హిట్ పడేలా చేస్తుందో లేదో చూడాలి.