మణి తో చరణ్ ఫిక్స్ అయ్యాడా .?

 ram charan mani rathnam movie fix
మణిరత్నం సినిమా ఛాన్స్ కోసం ఒకప్పుడు దేశంలోని టాప్ స్టార్స్ అంతా పోటీపడ్డవాళ్లే.కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మణి తడపడ్డాక ఆ క్రేజ్ తగ్గిన మాట నిజం.అయినా ఆయనతో సినిమాకి జయాపజయాలతో సంబంధం లేకుండా ఎదురుచూసే నటీనటులు చాలా మంది వున్నారు.ఓకే బంగారం విజయం తరువాత మళ్లీ మణి పై టాప్ స్టార్స్ దృష్టి పడుతోంది.తాజాగా ఆయనే చొరవ తీసుకొని చరణ్ కి ఓ కథ వినిపించినట్టు తెలుస్తోంది.చరణ్ కి ఆ కథ బాగా నచ్చి మణికి ఓకే చెప్పారట.అయితే కరెంటు ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యాకే ఈ సినిమా 2017 లో షూటింగ్ మొదలు కావొచ్చు.

గతంలో కూడా మణి,చరణ్ కాంబినేషన్ లోఓ సినిమా రావొచ్చన్న వార్తలు వచ్చినా అది నిజం కాలేదు.అంతక ముందు ఒకటిరెండు సార్లు చిరంజీవి ,మణి కాంబినేషన్లో సినిమాపై చర్చలు జరిగాయి.అవి కూడా వర్కౌట్ కాలేదు.ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మణితో సినిమా చేయాలని చరణ్ డిసైడ్ అయ్యారంట.ఆ దిశగా చిరు కూడా ఎంకరేజ్ చేసినట్టు సమాచారం.