లీకైన చెర్రీ కధ.. నిజమేనా?

Posted February 4, 2017

ram charan sukumar movie story leakedఓ పక్క హీరోగా మరో పక్క నిర్మాతగా రామ్ చరణ్ తేజ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల చెర్రీ హీరోగా రిలీజైన ధృవ సినిమా సక్సెస్ తో అలాగే చిరు మూవీ ఖైదీనెం. 150 సక్సెస్ తో  ఫుల్ జోష్ మీద ఉన్నాడు  ఈ మెగా హీరో. ఈ జోష్ తోనే రీసెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నటిచే సినిమాను మొదలుపెట్టేశాడు. ఈ సినిమాకు సంబంధించి తన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసేశాడు. ఇక ఈ సినిమాకి  పల్లెటూరి ప్రేమలు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చెర్రీ స్పందించక ముందే సినిమా కధ ఇదేనని, సినిమాకధ లీకైందని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి.

ఆ వార్తల ప్రకారం… హీరో ఓ పల్లెటూరి అబ్బాయి. అతడు చెవిటివాడు. అమాయకుడైన పల్లెటూరి యువకుడు సిటీలో  అడుగుపెట్టాల్సి వస్తుంది. అక్కడ ప్రయోగశాలలో  చేరిన అతడిపై ఓ ప్రయోగం జరుగుతుందట. ఆ తర్వాత హీరో జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ అని చెప్పుకొంటున్నారు. డిఫరెంట్ స్టోరీగా అనిపిస్తున్న ఈ కధ  తెర మీద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చెర్రీ అభిమానులు అంటున్నారు.