చిరిగిన ప్యాంటుతో చెర్రీ!!

Posted December 17, 2016

ram charan wearing Torn jeans with upasana
ధృవ మూవీ స‌క్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న రాంచ‌ర‌ణ్… ఈ మ‌ధ్య ఫ్యామిలీతో క‌లిసి సినిమాను చూశాడు. అంత వ‌ర‌కు ఓకే గానీ ఉపాస‌న‌తో బ‌య‌టికొచ్చిన‌ప్పుడు చెర్రీ వేసుకున్న ప్యాంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మామూలుగానైతే చెర్రీ-ఉపాస‌న బ‌య‌టికొస్తే… మీడియాలో ఆ విష‌యం హైలైట్ అవుతుంది. దాని కంటే కూడా ఇప్పుడు ప్యాంట్ టాపిక్ పై చ‌ర్చ జ‌రుగుతోంది.

చ‌ర‌ణ్ వేసుకున్న ప్యాంట్ స్పెషాలిటీ ఏంటంటే… జీన్సంతా చిరిగి ఉంది. లోప‌ల నుంచి ఇన్న‌ర‌వేర్ కూడా క‌నిపించేలా ఉంది ఆ ప్యాంటు. చెర్రీ ఏంటి… ఎలాంటి ప్యాంట్ వేసుకున్నాడేంటి.. అని అక్క‌డున్న వారు ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయారు. కానీ త‌ర్వాత తేరుకొని ఇదే ఇప్ప‌టి ట్రెండ్ క‌దా అని స‌రిపెట్టుకున్నారు. ట్రెండ్ అయినంత మాత్రాన మ‌రీ ఇంత‌లా చిరిగిన ప్యాంటు వేసుకోవ‌డం .. అదీ బ‌య‌ట‌కు వ‌చ్చినప్పుడు క‌రెక్ట్ కాదేమోనన్న వాద‌న వినిపిస్తోంది. ఎవ‌రి వ్య‌క్తిగ‌త ఇష్టాలు వారివి. అంత‌మాత్రాన స్టైల్ పేరుతో మరీ ఇంత ఎబ్బెట్టుగా ఉండే డ్రెస్ కూడా క‌రెక్ట్ కాదేమోనంటున్నారు సినీ విమ‌ర్శ‌కులు.

ప్యాంటు విష‌యం ప‌క్క‌న బెడితే చెర్రీ-ఉపాస‌న జంట చూడముచ్చ‌టగా కనిపించింది. ఇద్ద‌రూ ఎంచ‌క్కా న‌వ్వుతూ కెమెరాకు ఫోజులిచ్చారు. ధృవ స‌క్సెస్ తాలూకు ఆనందం వారి ముఖాల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.