కమ్మ,కాపు పాటలిక వినపడవు..

Posted December 2, 2016

Image result for vangaveeti movie
వంగవీటి పేరుతో రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమాకి సెన్సార్ కి ముందే కత్తెర పడింది. అయితే ఈ కత్తెర వేసింది ఎవరో కాదు..స్వయంగా రాంగోపాల్ వర్మ. అయన ఈ పని తేలిగ్గా ఏమి చేయలేదు.దాని వెనుక పెద్ద కారణమే వుంది.రంగా కుమారుడు రాధాకృష్ణ వంగవీటి సినిమాలో అభ్యంతరకర అంశాలున్నాయని హై కోర్ట్ ని ఆశ్రయించారు.దీంతో కోర్టు ముందు వాటిని తొలిగించడానికి రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది ఒప్పుకున్నారు.ఇప్పటికే కమ్మ,కాపు కులాల పేరుతో వచ్చిన పాటని ఆపేస్తామని,అదే పదజాలం వాడిన టీజర్ కూడా తొలగిస్తామని ఆ లాయర్ చిత్ర యూనిట్ తరపున కోర్టుకి విన్నవించుకున్నారు.

Image result for vangaveeti movie

వంగవీటి చిత్రం మీద ఎప్పటినుంచో అసంతృప్తిగా వున్న రాధా చివరికి కోర్ట్ ద్వారా దర్శకుడు రాముకి ఝలక్ ఇచ్చాడు.అయితే రంగా గురించి రాధా కన్నా తనకే ఎక్కువ తెలుసని ఎప్పటినుంచో చెప్తున్న రాము ఈ పరిణామాన్ని ఎలా తీసుకుంటాడో …ట్విట్టర్ వేదికగా ఎలాంటి కామెంట్స్ చేస్తాడో చూడాలి.