వర్మ అద్దాలు కాదు భూతద్దాలు వాడతారు..

0
78

Posted April 25, 2017 at 11:19

ram gopal varma controversies on viswanadh
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదనే నానుడిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజం చేసాడు.ఇకపై ఎవరినీ హర్ట్ చేయబోనని ట్విట్టర్ ద్వారా ఓ ప్రామిస్ చేసిన వర్మ తీరు మారుతుందని చాలా మంది అనుకున్నారు.కానీ అలా జరగలేదు.కాకపోతే కొద్దిగా టోన్ మారిందంతే.కళాతపస్వి కె. విశ్వనాధ్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందని తెలియగానే వర్మ కూడా దానిపై స్పందించాడు. ఈసారి విశ్వనాధ్ మీద పాజిటివ్ గానే మాట్లాడబోయిన వర్మ ఆ క్రమంలో దాదాసాహెబ్ నే తక్కువ చేసాడు.

ram gopal varma controversies on viswanadh
వర్మ చేసిన తాజా ట్వీట్స్ లో తాను విశ్వనాధ్ తో పాటు దాదాసాహెబ్ ఫాల్కే సినిమాలు చూశానని,ఫాల్కే కన్నా విశ్వనాధ్ సినిమాలు బాగుంటాయని కామెంట్ చేసాడు వర్మ.అంతటితో ఆగకుండా ఫాల్కే అవార్డు విశ్వనాధ్ కి ఇవ్వడం కన్నా,విశ్వనాధ్ పేరుతో అవార్డు నెలకొల్పి దాదాసాహెబ్ కి ఇస్తే బాగుండేదని అన్నాడు.ఏదైనా వర్మ దేన్నీ తిన్నగా తీసుకొనేలా లేడు. ప్రపంచాన్ని ,మనుషుల్ని ,ఘటనల్ని చూడటంలో ఆయన తన కళ్ళకి,మనసుకి అద్దాలు కాకుండా భూతద్దాలు వాడుతున్నట్టున్నాడు .

ram gopal varma controversies on viswanadh