వ‌ర్మ త‌ర్వాతి టార్గెట్ జ‌గనేనా?

Posted January 28, 2017

ram gopal varma next target jagan
ట్విట్టర్ ద్వారా వ‌రుస కామెంట్లతో సంచ‌ల‌నం సృష్టిస్తున్న రాంగోపాల్ వ‌ర్మ త‌ర్వాతి టార్గెట్ వైసీపీ అధినేత జ‌గ‌నేనా? ఇప్పుడు ఎంత పొగడుతున్నారో.. త‌ర్వాత అదే స్థాయిలో విమ‌ర్శలు చేయ‌డం ఖాయ‌మేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

రాంగోపాల్ వ‌ర్మ డైరెక్ట్ గా ఎవ‌రిపైనా విమ‌ర్శలు చేయ‌రన్న వాద‌న ఉంది. మొదట ప్రశంసలు.. తేడా వస్తే భయంకరమైన తిట్లు.. అదే ఆయన తీరు. అందులో వాస్తవం లేక‌పోలేదు. మెగాస్టార్ చిరంజీవిపై వ‌ర్మ మొద‌ట్నుంచి ప్రశంస‌లు కురిపించారు. కానీ ఖైదీ నెంబ‌ర్ -150 తర్వాత నుంచి ఆయన రూట్ మార్చారు. అటు ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలోనూ అలానే జ‌రిగింది. ముందు ప‌వ‌న్ ను ఆకాశానికెత్తేసిన వారిలో వ‌ర్మ కూడా ఉన్నారు. కానీ హోదా పోరుకు వ‌చ్చేస‌రికి అది తిరగ‌బ‌డింది. జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్దతు తెలిపిన హీరోల విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. ఇప్పుడు జ‌గ‌న్ విష‌యంలోనూ రామూ అలాగే చేశారు. నిజమైన వీరుడు జగన్ అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఓ గదిలో కూర్చుని ట్వీట్లు చేస్తుంటే జగన్ మాత్రం వీరుడిలా ప్రవర్తించార‌ని… ఆయన తీరుకు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు వర్మ.

ఇప్పుడు వ‌ర్మ ప్రశంస‌ల‌తో జ‌గ‌న్ బ్యాచ్ ఫుల్ ఖుషీగా ఉంద‌ట‌. కానీ కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు మాత్రం అప్పుడే సినిమా అయిపోలేదంటున్నారు. జ‌గ‌న్ చిన్న త‌ప్పు చేసినా… ముందు విమ‌ర్శించేది వ‌ర్మేనంటూ గుస‌గుస‌లాడుకుంటున్నారు. అప్పుడు జ‌గ‌న్ ను ప‌వ‌న్ కంటే ఎక్కువ విమ‌ర్శించినా ఆశ్చర్యపోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. సో.. ఏ ర‌కంగా చూసినా… ఏక్షణంలోనైనా వ‌ర్మ జ‌గ‌న్ పై విరుచుకుప‌డే అవకాశ‌ముంద‌ని చెబుతున్నారు.