వర్మకి తుపాకీ కనిపించింది..

Posted February 1, 2017

ram gopal varma says andhra pradesh map look like gun
యద్భావం తద్భవతీ …అంటే ఏమి అనుకుంటే అదే జరుగుతుందని.దీన్ని ఇంకాస్త విస్తరిస్తే ఇంకో మాట చెప్పుకోవచ్చు.ఎలా చూస్తే అలా కనపడుతుందని.ఆంధ్రప్రదేశ్ అనే విషయం మీ మదిలో మెదిలితే ఏమి కనిపిస్తుంది? ఏ ఆలోచనలు వస్తాయి ?రాజకీయాలో,సినిమాలో,పర్యాటక ప్రాంతాలో, దేవాలయాలు,నదులు,సముద్ర తీరం ఇలా ఏదో ఒకటి మన మనసుని ఆక్రమిస్తుంది.కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మదిలో మాత్రం ఇవేమీ మెదల్లేదు.ఆయనకీ ఏపీ మ్యాప్ చూడగానే ఏమి కనిపించిందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.ఏపీ మ్యాప్ చూడగానే ఆయనకీ తుపాకీలా కనిపిస్తోందట. అదే విషయాన్ని ఆ మ్యాప్ తో సహా వేసి నెటిజెన్లతో తన ఐడియా పంచుకున్నారు.

రామ్ గోపాల్ వర్మ నిన్నమొన్నటి దాకా హీరోలు,సినిమాలు గురించి సోషల్ మీడియాని హోరెత్తించారు.ఒకటి రెండు కాదు చాలా వరకు అవి బంతిలా తిరిగి తనకే తగలడంతో వర్మ రూట్ మార్చుకున్నట్టుంది.అయితే ఈసారి ఆయన ఏపీ మ్యాప్ మీద కామెంట్ చేసినా అది తుపాకీలా వుంది కాబట్టి ఇష్టపడతానని చెప్పి మరో వివాదానికి స్కెచ్ వేస్తున్నట్లుంది.ఏపీ గురించి రాబోయే రోజుల్లో వర్మ మరింతగా సోషల్ మీడియాలో రెచ్చిపోయే అవకాశముంది.