నాగ్ విషయంలో అది వదిలేస్తున్నా: వర్మ

ram gopal varma sensational tweet nagarjuna birthday

సంచలనానికి మారు పేరుగా త్వీట్స్ తోనే విమర్శలకు కేంద్ర బిందువుగా మారిన రాం గోపాల వర్మ ఈ మధ్య తన ట్వీట్స్ వేగాన్ని తగ్గించాడని చెప్పాలి. ఇక కొద్దిగా మారుతున్నట్టు అనిపిస్తున్న వర్మ నిన్న కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా ట్వీట్ మరో సంచలనంగా మారింది. సాధారణంగా తనకు బర్త్ డే కు విష్ చేయడం ఇష్టముండదు కాని నాకు దర్శకుడిగా మారే అవకాశం ఇచ్చిన నాగార్జున విషయంలో దాన్ని వదిలేస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

ఎలాంటి అనుభవం లేకుండా ఓ కొత్త దర్శకుడు వచ్చిన్ సినిమా తీస్తా అంటే నమ్మి అలాంటి దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. అతనే వర్మ ఆ సినిమానే శివ. ఇక టాలీవుడ్ హిస్టరీలో శివ సినిమా పొజిషన్ ఏంటో అందరికి తెలిసిందే. అందుకే తనకు డైరక్టర్ గా జన్మనిచ్చిన నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు వర్మ. వర్మ విషయంలోనే కాదు తెలుగు సినిమాలకు కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన వారిలో నాగార్జున కూడా ఒకరని చెప్పొచ్చు. ఇప్పటి సినిమాల్లో నవరసాలను పండిస్తూ ఓ సెపరేట్ క్రేజ్ సంపాదిస్తున్నాడంటే అది కేవలం నాగ్ వల్లనే అవుతుంది.