చిరు బర్త్ డే కి చరణ్ గిఫ్ట్..

 ramcharan birthday gift to chiruచిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. కాజల్‌ కథానాయిక. కొణెదల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాంచరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ నిర్మాత రాంచరణ్‌ ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. చిరు గ్రాండ్ పిక్చర్‌కు పనిచేస్తున్న చిత్ర బృందం, తోటతరణి, రత్నవేల్‌, దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాత రాంచరణ్‌, దర్శకుడు వి.వి.వినాయక్‌లను ఇందులో పరిచయం చేశాడు. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ హ్యాపీబర్త్‌డే మెగాస్టార్‌ అంటూ విడుదల చేసిన ఈ వీడియో అభిమానులను అలరిస్తోంది.

[wpdevart_youtube]_14RutcoeFQ[/wpdevart_youtube]