మళ్లీ మెగా హీరోలపై వ్యాఖ్యలు చేసిన వర్మ

0
73

 Posted May 3, 2017 at 13:38

ramgopal varma tweet about on mega fans
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవలే మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన విషయం తెల్సిందే. ఇకపై మెగా హీరోలపై ఎలాంటి కామెంట్స్‌ చేయను అంటూ ఒట్టు వేసి మరీ మళ్లీ ఇండైరెక్ట్‌గా కామెంట్స్‌ చేశాడు. ‘బాహుబలి 2’ సినిమా విడుదలైనప్పటి నుండి వరుసగా ట్వీట్స్‌ చేస్తూ వస్తున్న వర్మ తాజాగా మరోసారి తనదైన శైలిలో మెగా హీరోలు మరియు ఇతర హీరోలపై కామెంట్స్‌ విసిరాడు. కులాల పేరుతో అభిమానులను వెంట వేసుకుని తిరిగే అభిమానులు ఇక మూసుకోవాల్సిందే అంటూ అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు.

వర్మ ట్విట్టర్‌ ద్వారా.. ‘బాహుబలి 2’ సినిమాతో ప్రభాస్‌ స్థాయి అమాంతం పెరిగి పోయింది. కులాల పిచ్చి ఉన్న ఏ హీరో కూడా ఇప్పుడు ప్రభాస్‌ను తాకలేరు. లోకల్‌ అభిమానుల గురించి ఆలోచించి, కు పిచ్చి ఉన్న వారు చేసే సినిమాలతో రాష్ట్రానికే పరిమితం అవుతారంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌ లోకల్‌ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగాడని, ప్రభాస్‌ స్థాయి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా వెళ్లిందని, ఇతర హీరోలు మాత్రం తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్‌ను, కులాలను పట్టుకుని వేలాడుతున్నారంటూ వర్మ విమర్శలు గుప్పించాడు.