రమ్య ఆ గుట్టు విప్పేసింది…సెన్సేషనల్ అయ్యింది

0
46

Posted May 10, 2017 at 15:35

ramya krishna says about cinema field problems
సినీ రంగంలో వేషాల కోసం వచ్చే అమ్మాయిల్ని వాడుకోవడం,వేధించడం అన్న విషయం ఈ మధ్య హాట్ టాపిక్ అయిపోతోంది.ఈ రంగంలో కొందరు బడాబడా ప్రొడ్యూసర్స్,దర్శకులు తమని ఇబ్బంది పెట్టారని కొందరు నటీమణులు ఈ మధ్య బహిరంగంగా బయటికి చెప్పేస్తున్నారు. మరికొందరు ఫీల్డ్ వదిలేసిన 10 ,15 ఏళ్ళకి ఇప్పుడు బయటపెడుతున్నారు.ఇందులో నిజానిజాలు ఏమిటో ఎవరికీ స్పష్టంగా తెలిసే అవకాశం లేదు.ఎందుకంటే ఇవి జరిగింది ఎప్పుడో అని చెప్పడంతో అందరికీ వస్తున్న డౌట్ అప్పట్లో ఎందుకు బయటపెట్టలేదా అని. సున్నితమైన ఈ అంశం మీద శివగామి రమ్యకృష్ణ పెదవి విప్పింది.ఇంతకీ రమ్య మాటలు ఏంటో తెలుసా ?

” అన్ని రంగాల్లో వున్నట్టే సినిమా రంగంలోనూ అడ్జెస్ట్ కావాల్సి ఉంటుంది.ఇక్కడ అడ్జెస్ట్ అవ్వడమా,లేదా అనేది వారి వ్యక్తిగత నిర్ణయం.అయితే అడ్జెస్ట్ అయ్యినవాళ్ళే ఈ రంగంలో రాణించే అవకాశాలు ఎక్కువ” …ఇలా రమ్యకృష్ణ ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది.అదిప్పుడు సెన్సేషనల్ అయ్యి కూర్చుంది .అయితే ఆ ప్రకటనలో రమ్యకృష్ణ చెప్పిన ఆ అడ్జెస్ట్ మెంట్ ఏమిటన్నదానిపై ఇటు టాలీవుడ్ ..అటు కోలీవుడ్ లో చర్చోప చర్చలు సాగుతున్నాయి.అయితే రమ్య మాటలు ఎవరినీ తప్పు పట్టకుండా వున్న పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయని ఆమెని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు.రమ్య లాంటి సీనియర్ నటులే ఇలా జరుగుతున్న తప్పుని ఖండించకపోవడం ఏంటని ఇంకో వర్గం వాదిస్తోంది.ఏమైనా లోపల ఏదీ దాచుకోకుండా మాట్లాడే రమ్య ఇప్పుడు చేసిన స్టేట్ మెంట్ మున్ముందు ఎలా ఉంటుందో చూద్దాం.