బాబు క్యాబినెట్లో రేపిస్ట్ లు ఎవరబ్బా?

 Posted November 7, 2016

rapists in chandrababu cabinet
జై ఆంధ్ర ప్రదేశ్ సభలో వైసీపీ అధినేత చేసిన ఓ ఆరోపణపై టీడీపీ లోను చర్చ సాగుతోంది.ఇద్దరు రేపిస్టులు ఏపీ క్యాబినెట్ లో వున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ నివేదిక ఇచ్చిందని జగన్ ప్రస్తావించడం సంచలనం రేపింది.ఆ నివేదికలో కేసు నెంబర్ వివరాలు కూడా వున్నాయంటూ జగన్ చెప్పడంతో ఆ ఆరోపణలు వచ్చిన మంత్రులు ఎవరో తెలీక అందరూ జుట్టు పీక్కుంటున్నారు.ఇప్పటిదాకా అలాంటి విషయమే ప్రస్తావనకు రాలేదు..ఇప్పుడు ఓ సంస్థ నివేదికని ప్రస్తావించిన జగన్ సైతం ప్రతిపక్ష నేత హోదాలో ఆ విషయం మీద అసెంబ్లీ లేదా బయట మాట్లాడిన దాఖలాలు కూడా లేవు.రాష్ట్రంలో పరిస్థితి,పాలన బాగా లేవని చెప్పేందుకు జగన్ ఈ టాపిక్ తెచ్చి ఉండొచ్చు..నిజంగా అయన చెప్పిన దానిలో వాస్తవముంటే మాత్రం అది తేలిగ్గా తీసేసే విషయం కాదు.అయినా ఆరోపణలు చేసిన అసలు అవి ఎవరి మీద ఉన్నాయో చెప్తే బాగుండేది ..