జగన్ పార్టీలోకి పవన్ హీరోయిన్?

0
124

 Posted October 27, 2016

rashi join jagan ycp party
వైసీపీ లోకి మరో హీరోయిన్ రాబోతోందా? రోజా కి ఉన్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కి భిన్నమైన ఇమేజ్ ఉన్న మరో కథానాయకి జగన్ గూటికి చేరబోతున్నట్టు లోటస్ పాండ్ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం.ఇంతకీ ఆమె పవన్ పక్కన హీరోయిన్ గా చేసిన రాశి.ఆ ఇద్దరు కెరీర్ తొలిదశలో గోకులంలో సీత అనే సూపర్ హిట్ సినిమాలో కలిసి నటించారు.పెళ్లి చేసుకున్న తర్వాత తక్కువ సినిమాలు చేస్తున్న రాశి…కుమార్తె పుట్టినపుడు జగన్ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.అప్పట్లోనే ఆమె వైసీపీ లో చేరొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి.అయితే అదేమీ జరగలేదు.ఇప్పుడు మళ్లీ రాశి గురించి లోటస్ పాండ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఆమె రాజకీయ రంగప్రవేశం ఆలస్యం కావడానికి ఓ కారణముంది.అదే రాజకీయ అవగాహన పెంచుకోవడం.ఆ నమ్మకం కుదిరాక రాశి వైసీపీ లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.