పవన్‌ మారాడు అనేందుకు రాశి మాటలే సాక్ష్యం

Posted April 20, 2017 at 18:21

rashi said about pawan kalyan in lanka movie promotion
పవన్‌ గతంతో పోల్చితే చాలా మారాడు అంటూ ఆయన సన్నిహితులు మరియు ఆయనతో పని చేసిన వారు చెబుతూ వస్తున్నారు. పవన్‌ పార్టీ పెట్టిన తర్వాత నుగురిలో కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నాడు. అయితే గతంలో మాత్రం పవన్‌ సినిమాలో తనతో కలిసి నటించే వారితో కూడా మాట్లాడక పోయేది. షూటింగ్‌ సమయంలో తన సీన్స్‌ను చేయడం, పక్కకు వెళ్లి కూర్చోవడం చేసేవాడు. కాని ఇప్పుడు పవన్‌ తీరు మారింది. అన్ని విషయాలను పవన్‌ పట్టించుకుంటున్నాడు. అదే విషయాన్ని నిన్నటి తరం హీరోయిన్‌ రాశి చెప్పుకొచ్చింది.

రాశి తాజాగా ‘లంక’ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ గురించి కూడా రెండు ముక్కలు మాట్లాడటం జరిగింది. ‘గోకులంలో సీత’ చిత్రంలో పవన్‌కు జోడీగా రాశి నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో పవన్‌ పెద్దగా మాట్లాడేవాడు కాదట. తాజాగా తన కూతురు పుట్టిన రోజు సందర్బంగా పవన్‌ను ఆమె కలిసింది. అప్పటి కంటే ఎక్కువ ఇప్పుడు పవన్‌ ఆమెతో మాట్లాడాడట. ఆ విషయాన్ని రాశి చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. పవన్‌ మునుపటితో పోల్చితే చాలా మారాడు అనేందుకు రాశి మాటలు కూడా సాక్ష్యంగా తీసుకోవచ్చు అని ఆయన సన్నిహితులు మరియు ఫ్యాన్స్‌ అంటున్నారు.