రష్మిని వేధిస్తున్న సమస్య..!

Posted November 28, 2016

 Rashmi Facing Problems For Unknown Calls

జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ సంపాదించిన రష్మి అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుతుంది. అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనతో హాట్ ఫేవరేట్ అయిన ఈ అమ్మడికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. హాట్ యాంకర్ కు సమస్య ఏంటి అంటే ఎలాగోలా ప్రేక్షకుల్లో హాట్ ఇమేజ్ సంపాదించాలని అనుకుని అందులో సక్సెస్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు తన ఫోన్ కు వస్తున్న కాల్స్ ను కట్రోల్ చేయలేకపోతుందట. నెంబర్ ఎలా తెలుస్తుందో ఏమో కాని రోజుకి కనీసం ఓ 50 మంది తన ఫ్యాన్స్ అంటూ విసిగిస్తున్నారని కొందరైతే కాస్త శృతిమించి మాట్లాడుతున్నారని అంటుంది రష్మి.

సాధారణంగా ఇలాంటి వాటినివన్ని బయట పెట్టరు హీరోయిన్స్ కాని రష్మి కావాలనే తనకు మరింత పబ్లిసిటీ రావాలని ఇలా చేస్తుంది అంటున్న వారు ఉన్నారు. ఏది చేసినా ఎలా చేసినా రష్మి మాత్రం ప్రస్తుతం యూత్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదించింది. మరి అభిమానం ఎక్కువైతే ఇలాంటివి కామనే కాబట్టి సాధ్యమైనంతవరకు ఫోన్ అవైడ్ చేస్తే మంచింది లేదు మరి మితిమీరుతున్నారనుకుంటే నెంబర్ మార్చడమో లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో చేస్తే బెటర్.