రాయపాటి దండ,దండం చాలా కాస్ట్ లీ గురూ..

Posted April 22, 2017 at 11:19

rayapati sambasiva rao make rose petals garland for guests and along with demand papers
ఎదుటివారు మనకి దండ వేసి దండం పెడుతున్నారంటే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు విషయంలో మాత్రం ఇది కాస్త రివర్స్ అవుతోంది.ఆయన దండ తీసుకుని వస్తున్నా,దండం పెడుతున్నా ఆ సత్కారం పొందేవాళ్ళు భయపడుతున్నారట.ఈ విషయంలో చోటామోటా నేతలే కాదు సాక్షాత్తు సీఎం చంద్రబాబు,ఆయన కుమారుడు,రాష్ట్ర మంత్రి లోకేష్ సైతం రాయపాటి దండ,దండం చూసి షేక్ అవుతున్నారు.ఇంతకీ దాని వెనుక వున్న కారణం ఏంటో కాదు…దండ,దండం తో పాటు తన నియోజకవర్గానికి సంబంధించిన వివిధ పనుల అర్జీలు కట్టలకొద్దీ తీసుకొస్తారట.వాటికి నిధుల మంజూరు కోసం తెగ మొహమాటపెట్టేస్తారట.అందుకే రాయపాటి వారి దండ,దండం బహు కాస్ట్ లీ అని సీఎం పేషీ సహా ,మంత్రుల పేషీల్లో కామెంట్స్ వినిపిస్తుంటాయి.

ఈ కామెంట్స్ విన్న రాయపాటి సాంబశివరావు వీరాభిమాని తమ నేత వేసే దండ గురించి తెలిస్తే ఇలా మాట్లాడరని కాస్త రోషంగా అనేశాడు.ఏంటీ ఆ దండల్లో విశేషం అని అడిగితే ఆశ్చర్యం కలిగించే విషయాలెన్నో చెప్పాడు.రాయపాటిగారు ఈ “దండ” యాత్ర చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారట.కేరళలో యాలకులు లేదా కర్పూరంతో ప్రత్యేకంగా ఈ దండాలు చేయిస్తారు.యాలకులతో చేసే దండ ఖరీదు దాదాపు 20 వేల దాకా వుంటుందట.ఇక కర్పూరం దండ అంత ఖరీదు కాకున్నా సువాసనలతో అతిధి మనసుని పరిమళభరితం చేస్తుంది. ఇక యాలుక దండని అలా వేలాడదీస్తే కొన్ని నెలలపాటు సువాసన వెదజల్లుతుంది.ఇప్పటి రాష్ట్రపతి ,ఒకప్పటి కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ రాయపాటివారి దండయాత్రకు మురిసిపోయినవారే.ఇలా రాయపాటి అభిమాని ఆవేశంగా చెప్పిన మాటలు విన్నాక కూడా ఆయన దండ,దండం కాస్ట్ లీ అనే కామెంట్ నిజమే అనిపిస్తోంది.